టీటీడీ సంప్రదాయ భోజనం నిలిపివేత.. వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీపై గతకొన్ని రోజులుగా జరుగుతున్న దుష్పచారంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ భోజనంపై వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. సంప్రదాయ భోజనాన్ని అమ్మడం లేదని, ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు. […]

Update: 2021-08-29 23:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీపై గతకొన్ని రోజులుగా జరుగుతున్న దుష్పచారంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ భోజనంపై వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. సంప్రదాయ భోజనాన్ని అమ్మడం లేదని, ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు. తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందువలనే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం‌ తీసుకున్నట్లు ఆయన వివరించారు. సోషల్‌ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు.

Tags:    

Similar News