భారీగా పెరిగిన వెంకన్న ఆదాయం….

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. వెంకన్న ఆలయానికి ఒక్కరోజే రూ. 2.34 కోట్లు ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ తర్వాత చూస్తే ఆదివారం నాడు మాత్రమే ఆదాయం రూ. 2 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు. సుమారు 12వేలకు మంది పైగా భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారని వారు తెలిపారు. లాక్ డౌన్ మొదలయ్యాక మార్చి మూడవ వారంలో నిబంధనలకు అనుగుగా దర్శనాలు ప్రారంభించామని తెలిపారు.తొలిదశలో 3వేల మందికి […]

Update: 2020-09-28 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. వెంకన్న ఆలయానికి ఒక్కరోజే రూ. 2.34 కోట్లు ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ తర్వాత చూస్తే ఆదివారం నాడు మాత్రమే ఆదాయం రూ. 2 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు. సుమారు 12వేలకు మంది పైగా భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారని వారు తెలిపారు.

లాక్ డౌన్ మొదలయ్యాక మార్చి మూడవ వారంలో నిబంధనలకు అనుగుగా దర్శనాలు ప్రారంభించామని తెలిపారు.తొలిదశలో 3వేల మందికి దర్శనాలు చేయించామని తెలిపారు. దీంతో ఆదాయం క్రమ క్రమంగా తగ్గుతూ 50లక్షల దిగువకు చేరిందన్నారు. లాక్ డౌన్ కు ముందు ఆదాయం మూడు కోట్లకు పైగా వచ్చేదని అధికారులు చెప్పారు. తాజా పరిస్థితులను బట్టి చూస్తే తితిదే తన గత వైభవాన్ని సంతరించుకుంటోందనీ, ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తోందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News