కరెంటు బిల్లులు చెల్లించండి
దిశ, న్యూస్‌బ్యూరో : ఈ నెల విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించి సంస్థకు మద్దతు తెలపాలని రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ఎండీ జి.రఘుమారెడ్డి కోరారు. tssouthernpower.com వెబ్‌సైట్‌కు వెళ్లి కస్టమర్లు తమ సెల్ నెంబరును యూనిక్ సర్వీసు నెంబర్(యూఎస్‌సీ)తో లింకు చేసుకోవచ్చని, అనంతరం టీ వాలెట్, బిల్ డెస్క్, పేటీఎం, ఫోన్ పే, మీ సేవా ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లలో ఏ పద్ధతిలోనైనా బిల్లు చెల్లించవచ్చిని తెలిపారు. ఈ మేరకు మంగళవారం […]
దిశ, న్యూస్‌బ్యూరో : ఈ నెల విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించి సంస్థకు మద్దతు తెలపాలని రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ఎండీ జి.రఘుమారెడ్డి కోరారు. tssouthernpower.com వెబ్‌సైట్‌కు వెళ్లి కస్టమర్లు తమ సెల్ నెంబరును యూనిక్ సర్వీసు నెంబర్(యూఎస్‌సీ)తో లింకు చేసుకోవచ్చని, అనంతరం టీ వాలెట్, బిల్ డెస్క్, పేటీఎం, ఫోన్ పే, మీ సేవా ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లలో ఏ పద్ధతిలోనైనా బిల్లు చెల్లించవచ్చిని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్ ఈఆర్సీ ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో వచ్చిన కరెంటు బిల్లునే చెల్లించాల్సిందిగా కస్టమర్లను కోరామని ఎవరైనా ఎక్కువగా బిల్లులు వచ్చాయని భావిస్తే వచ్చే నెలలో తిరిగిచ్చేస్తామని హామీ ఇచ్చారు. మే నెలలో మీటర్ రీడింగ్ నమోదు చేసి కచ్చితమైన బిల్లు అందజేస్తామని పేర్కొన్నారు. లాక్‌డౌన్ వల్ల అందరు ఇళ్లలోనే ఉంటుండడంతో గృహ విద్యుత్ కేటగిరిలో కరెంటు వాడకం ఎక్కువగానే ఉందని రఘుమారెడ్డి తెలిపారు.
అంతంత మాత్రంగానే వసూళ్లు..
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో గృహ వినియోగం కేటగిరిలో రావాల్సిన రూ.650 కోట్లకుగాను కేవలం రూ.120 కోట్లే ఇప్పటివరకు వసూలైనట్టు తెలుస్తోంది. కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరీల్లో రూ.1100 కోట్లు వసూలవాల్సి ఉండగా 50 శాతం మాత్రమే వసూలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించమని ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కస్టమర్లు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తమ వద్ద బిల్లు చెల్లించడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఫోన్లు లేవని ఎక్కువమంది చెబుతున్నట్టు సమాచారం. ఇక రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్‌లోనూ బిల్లు చెల్లింపుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Tags: telangana, tsspdcl, raghuma reddy, lockdown, power bills