అప్పులు చేసి..గోవాకు చెక్కేసి

దిశ, వెబ్‌డెస్క్ : మల్లారెడ్డి బీటెక్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతూ కనిపించకుండా పోయిన విద్యార్థి జీవన్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టిన తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీని కనుగొన్నారు. జీవన్‌రెడ్డి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు గోవాలో ఉన్నట్టు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..గత 15రోజుల కిందట జీవన్ రెడ్డి కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు విద్యార్థి ఉండే హాస్టల్‌కు […]

Update: 2020-02-26 02:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
మల్లారెడ్డి బీటెక్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతూ కనిపించకుండా పోయిన విద్యార్థి జీవన్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టిన తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీని కనుగొన్నారు. జీవన్‌రెడ్డి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు గోవాలో ఉన్నట్టు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..గత 15రోజుల కిందట జీవన్ రెడ్డి కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు విద్యార్థి ఉండే హాస్టల్‌కు వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ అతని తల్లిదండ్రులు హాస్టల్ బాత్ రూంలో రక్తపు మరకలు గమనించామని, తన కొడుక్కు ఏమైందోనని ఆందోళన వ్యక్తంచేశారు.ఇదంతా ఓవైపయితే జీవన్‌రెడ్డి కనిపించకుండా పోవడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి,అప్పులు చేసి అవి తీర్చలేకనే గోవాకు చెక్కేసాడని జీవన్‌రెడ్డి నిజస్వరూపాన్ని బయట పెట్టారు.చదువు పక్కన పెట్టి జల్సాలకు చేయడం, తోటి మిత్రుల వద్ద అప్పులు చేసి తిరగడం అతనికి అలవాటుగా మారిందని తేల్చారు.చివరకు జీవన్‌రెడ్డిని పోలీసులు మందలించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News