టీఎస్ ఐఐసీ రూ.1.19 కోట్ల విరాళం
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ -19 నియంత్రణకు టీఎస్ ఐఐసీ రూ.1.19 కోట్ల విరాళం ప్రకటించింది. ఆ చెక్కును శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రగతి భవన్ లో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్ రాహుల్ బోజ్జాకు అందజేశారు. కొవిడ్‌ను అరిట్టేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. నాట్కో ఫార్మా వైస్ చైర్మన్, సీఈఓ […]
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ -19 నియంత్రణకు టీఎస్ ఐఐసీ రూ.1.19 కోట్ల విరాళం ప్రకటించింది. ఆ చెక్కును శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రగతి భవన్ లో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్ రాహుల్ బోజ్జాకు అందజేశారు.
కొవిడ్‌ను అరిట్టేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. నాట్కో ఫార్మా వైస్ చైర్మన్, సీఈఓ రాజీవ్ నన్నపనేని కొవిడ్ చికిత్సలో వినియోగిస్తున్న సుమారు 4.2 కోట్ల విలువైన బారిసిటినిబ్ మాత్రలను రాష్ట్రానికి అందిస్తామని, ఇందుకు సంబంధించిన పత్రాన్ని మంత్రి కేటీఆర్ కు అందజేశారు.