తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో 33 పోస్టుల భర్తీ కొరకు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు గురుకుల కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీటిలో 23 స్టాఫ్ నర్సు, ఒక కేర్ టేకర్, ముగ్గురు ల్యాబ్ అటెండర్లు, ఆరుగురు ఐసీటీ ఇన్ స్ర్టక్టర్లు కావాలని తెలిపారు. ఈ పోస్టులను ప్రాజెక్ట్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ల సమక్షంలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. […]

Update: 2021-08-29 11:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో 33 పోస్టుల భర్తీ కొరకు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు గురుకుల కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీటిలో 23 స్టాఫ్ నర్సు, ఒక కేర్ టేకర్, ముగ్గురు ల్యాబ్ అటెండర్లు, ఆరుగురు ఐసీటీ ఇన్ స్ర్టక్టర్లు కావాలని తెలిపారు. ఈ పోస్టులను ప్రాజెక్ట్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ల సమక్షంలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంతేగాక సాలరీలు కూడా వీరి ఆధ్వర్యంలోనే ఫిక్స్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ రిక్రూట్ మెంట్ కు కావాల్సిన అర్హతలు, నిబంధనలను తయారు చేయాలని ఆయా ప్రిన్సిపల్స్ ను సెక్రటరీ సూచించారు.

అయితే కాటారం, సిరిసిల్లా, హుస్నాబాద్, మణుగురు, నర్సంపేట్ హుజూర్ నగర్ , పాలకుర్తి, మనూర్ , జహీరాబాద్ , కంగ్టి, పరిగి, అచంపేట్ , కోడంగల్ , జడ్చర్ల, కౌడిపల్లి, తిరుమలాయపాలేం, మహబూబాబాద్ , దేవరకొండ, చివ్వెమ్లా, దామరచర్ల, కొత్తూర్ , ఇబ్రహీంపట్నం, నారాయణఖేడ్ గురుకులాల్లో స్టాఫ్ నర్సులు కావాలని, ఉట్నూర్ లో కేర్ టేకర్ , నర్సంపేట్ లో ముగ్గురు ల్యాబ్ అటెండర్లు, ఇందల్వాయి, జైనూర్ , మనూర్ , జడ్జర్ల, నర్సాపూర్ , చివ్వేమ్లా గురుకులాల్లో ఐసీటీ ఇన్ స్ర్టక్టర్లు ను భర్తీ చేయనున్నట్లు సెక్రటరీ ప్రకటించారు.

Tags:    

Similar News