దిగొచ్చిన ప్రభుత్వం.. నేడు చర్చలకు ఆహ్వానం

దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేటు టూర్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్​ ఆపరేటర్లకు జూన్, సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించిన పన్నురద్దు చేసే అంశంపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని తెలంగాణ ప్రైవేటు బస్సు, మ్యాక్సీ క్యాబ్​ల అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. నేడు 11 గంటలకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మతో ఈ విషయమై చర్చిస్తామని, ప్రభుత్వం పన్ను రద్దుకు ఒప్పుకోని పక్షంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే […]

Update: 2020-06-29 20:32 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేటు టూర్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్​ ఆపరేటర్లకు జూన్, సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించిన పన్నురద్దు చేసే అంశంపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని తెలంగాణ ప్రైవేటు బస్సు, మ్యాక్సీ క్యాబ్​ల అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. నేడు 11 గంటలకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మతో ఈ విషయమై చర్చిస్తామని, ప్రభుత్వం పన్ను రద్దుకు ఒప్పుకోని పక్షంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల క్వార్టర్లీ పన్నుబకాయిల రద్దుతోపాటు, జూలై 1వ తేదీతో ప్రారంభమయ్యే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ క్వార్టర్లీ పన్నును రద్దు చేయడానికిగాను మొత్తం వాహనాలు స్వాధీనం చేసుకోవాలనేవి తమ ప్రధాన డిమాండ్‌లని నిజాముద్దీన్ తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలకు రూ.10 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్ తమను ఆదుకోవడానికి పన్నుల మాఫీ ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. టూర్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్లపై ఆధారపడి తెలంగాణలో 5 లక్షల మంది దాకా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News