క్రీడలను ప్రోత్సహించేందుకే క్రీడా పాలసీ..

దిశ, వరంగల్ రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సాహించేందుకే క్రీడా పాలసీ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, కల్చరల్ స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనలో భాగంగా ములుగు రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.25లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నైపుణ్యత వృత్తి శిక్షణా కేంద్రం, హన్మకొండ జవహర్ లాల్ స్టేడియంలో రూ.7కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సింథటిక్ థ్లెటిక్ ట్రాక్ ఫీల్డ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు.ఈ […]

Update: 2020-05-24 10:17 GMT

దిశ, వరంగల్
రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సాహించేందుకే క్రీడా పాలసీ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, కల్చరల్ స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనలో భాగంగా ములుగు రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.25లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నైపుణ్యత వృత్తి శిక్షణా కేంద్రం, హన్మకొండ జవహర్ లాల్ స్టేడియంలో రూ.7కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సింథటిక్ థ్లెటిక్ ట్రాక్ ఫీల్డ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడల మంత్రి మాట్లాడుతూ..ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.భవిష్యత్తులో జిల్లా క్రీడల్లో కీలకంగా మారుతుందని చెప్పారు. క్రీడాకారులకు సింథటిక్ అథ్లెట్ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. క్రీడా పాలసీ ద్వారా 0.2 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ 0.5శాతం విద్యా సంస్థల్లో ప్రవేశ పెట్టేందుకు అనుమతి తీసుకుంటామన్నారు.అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రూ.325కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.ఇప్పటి వరకు 34వరకు పూర్తి చేయగా, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. క్రీడా పాలసీ తయారుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని, అందులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు కేటీఆర్, సబితా ఇంద్ర రెడ్డి, తాను కూడా సభ్యులుగా ఉన్నామన్నారు. తెలంగాణలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉండేలా నివేదికను కమిటీ ముందు పెడుతానన్నారు.సమావేశంలో శాప్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి ఉద్యోగ జేఏసీ చైర్మెన్ రవీందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ అజీజ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, టీఎన్జీవో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు జిల్లా క్రీడా అధికారి ఇందిరా, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News