వచ్చే ఏడాది నుంచి ఘనంగా చేసుకుందాం..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. దీని మూలంగా వైభవంగా జరుపుకోవాల్సిన పండుతలన్నీ నిరాడంబరంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాకుండా రాబోయే వినాయక చవితి ఉత్సవాలను కూడా అందరూ ఇండ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇంట్లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకుని వైరస్ అంతం కావాలని పూజలు చేయాలని కోరారు. హైదరాబాద్ నగర పరిధిలో 80 వేల గణేశ్ విగ్రహాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. దీని మూలంగా వైభవంగా జరుపుకోవాల్సిన పండుతలన్నీ నిరాడంబరంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతేగాకుండా రాబోయే వినాయక చవితి ఉత్సవాలను కూడా అందరూ ఇండ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇంట్లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకుని వైరస్ అంతం కావాలని పూజలు చేయాలని కోరారు. హైదరాబాద్ నగర పరిధిలో 80 వేల గణేశ్ విగ్రహాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి బోనాలు, గణేశ్ ఉత్సవాలు ఘనంగా చేసుకుందామని ప్రభుత్వం తెలిపింది.