బ్రేకింగ్: ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడగిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 17 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు. ఇప్పటి వరకు ఎంసెట్ కు మొత్తం 2,20,027 మంది విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగానికి 1,46,541 మంది, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ విభాగాలకు 73,486 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 18న […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడగిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 17 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు. ఇప్పటి వరకు ఎంసెట్ కు మొత్తం 2,20,027 మంది విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగానికి 1,46,541 మంది, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ విభాగాలకు 73,486 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంతో ఇప్పటి వరకు ఎంసెట్ గడువు తేదిని 3 సార్లు పొడిగించారు.