కమలా హారీస్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల మధ్య విమర్శల పరంపర కొనసాగుతోంది. తాజాగా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్న డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన విమర్శలు చేశారు. అమెరికా ప్రజలు ఆమెను ఇష్టపడరని, ఆమె గనక అమెరికా అధ్యక్షురాలైతే దేశానికి అంతకంటే అవమానం ఉండదని వ్యాఖ్యానించారు. ఆమె అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికీ జో బిడెన్ ఆమెను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేట్ చేయడం […]
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల మధ్య విమర్శల పరంపర కొనసాగుతోంది. తాజాగా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్న డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన విమర్శలు చేశారు. అమెరికా ప్రజలు ఆమెను ఇష్టపడరని, ఆమె గనక అమెరికా అధ్యక్షురాలైతే దేశానికి అంతకంటే అవమానం ఉండదని వ్యాఖ్యానించారు. ఆమె అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికీ జో బిడెన్ ఆమెను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేట్ చేయడం ఆసక్తి కలిగించే విషయమని ట్రంప్ చెప్పారు.
అలాగే, జో బిడెన్ అధ్యక్షుడిగా గెలిస్తే చైనా గెలిచినట్టేనని, అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రపంచ గొప్ప ఆర్థిక వ్యవస్థగా నిర్మించామని, జో బిడెన్ విధానాలు అమెరికా పతనానికి దారి తీస్తాయని ట్రంప్ విమర్శించారు. అందుకే చైనా ఆయన గెలవాలని కోరుకుంటోంద న్నారు. జో బిడెన్ విధానాలన్నీ చైనాకు అనుకూలమైనవని విమర్శించారు. అంతేకాకుండా, తాము చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న తక్కువ వ్యవధిలోనే కరోనా వైరస్‌ను ప్రపంచంపైకి విసిరిందని, కాబట్టి చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని గతం కంటే భిన్నంగా చూస్తున్నట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు.