హుజూరాబాద్ లో టీఆర్ఎస్‌దే విజయం : హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మసీదుల కమిటీ నిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు పలువురు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోగల మంత్రి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మసీదుల కమిటీ నిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు పలువురు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోగల మంత్రి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజలు లౌకిక మనస్తత్వం కలిగిన వారని, ఎల్లప్పుడూ లౌకిక పార్టీలకు మద్దతు ఇస్తారన్నారు.
ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. 8000 మంది ముస్లిం ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చగా, ఓటర్ల జాబితా నుంచి చాలా మంది పేర్లను తొలగించారని మసీదు నిర్వహణ కమిటీ ప్రతినిధుల బృందం వివరించింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థించారు. స్పందించిన మంత్రి శ్మశానవాటికల కోసం మూడు ఎకరాల ప్రభుత్వ భూమి, వివాహ వేదికల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మసీదుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.