హుజూరాబాద్‌లో కోట్లు ఖర్చు చేసిన టీఆర్ఎస్‌కు డిపాజిట్ దక్కదు

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్‌లో వార్ వన్ సైడ్ అని… కాషాయ జెండా ఎగురడం తధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజూరాబాద్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కదన్నారు. నిజమైన ఉద్యమకారుడు… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఈటల […]

Update: 2021-06-21 11:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్‌లో వార్ వన్ సైడ్ అని… కాషాయ జెండా ఎగురడం తధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజూరాబాద్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కదన్నారు. నిజమైన ఉద్యమకారుడు… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలనే తపనతోటి ఈటల సాగారన్నారు. ఒక ఆలోచన, ఆశయం.. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈటల చేసిన పోరాటానికి ప్రత్యక్ష సాక్షినని బండి సంజయ్ తెలిపారు.

అమరవీరుల ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. గడీల పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, అరాచక పాలన ఏ విధంగా కొనసాగుతుందో చూసిన తర్వాత నిజమైన ఉద్యమకారులంతా బీజేపీలో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్, అవినీతి, అరాచక పాలను ఎదిరించే పార్టీ బీజేపీయే అన్నారు. ఉద్యమ నాయకులు బీజేపీని వేదికగా చేరడం, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఉత్సాహం, ఆలోచనలను నింపిదన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. హుజూరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం బీజేపీకి అండగా నిలువ నున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ఈటలకు ఆత్మీయ స్వాగతం

బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి ఈటలకు పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈటల చేరితో బీజేపీ రాష్ట్రంలో మరింత బలోపేతం అయిందని పలువురు నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శ తరున్ చుగ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ అరవింద్ కుమార్, ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ నాయకుడు వివేక్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News