ఖమ్మం పీఠం కారుదే..
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు లెక్కింపు జరిగిన ఐదు రౌండ్లలో అధికార పార్టీ ఆధిక్యాన్ని కనబరిచి కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ -37, కాంగ్రెస్ -9 సీపీఐ -2, సీపీఎం -2, బీజేపీ -1, స్వతంత్రులు -2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. చివరి రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. ఇంకా ఆరు స్థానాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు లెక్కింపు జరిగిన ఐదు రౌండ్లలో అధికార పార్టీ ఆధిక్యాన్ని కనబరిచి కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ -37, కాంగ్రెస్ -9 సీపీఐ -2, సీపీఎం -2, బీజేపీ -1, స్వతంత్రులు -2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. చివరి రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. ఇంకా ఆరు స్థానాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ రౌండ్లో కూడా టీఆర్ఎస్కే ఎక్కువ స్థానాలు దక్కనున్నాయి. కార్పొరేషన్ పోరులో మొదట టీఆర్ఎస్‌తో సైఅంటే సై అన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మధ్యలోనే చేతులెత్తేయగా.. చివరికి పరువు దక్కించుకునేందుకే ప్రయత్నించాయి. ఆ పార్టీ నాయకులు ఎంత ప్రయత్నించినా నామమాత్రపు సంఖ్యతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పొత్తులతో సత్తా చాటుదామనుకున్నా ఏమాత్రం ఎత్తులు ఫలించలేదు. కమలం పార్టీతో జతకట్టి మొదటిసారి బరిలోకి దిగిన జనసేన బోనీ కొట్టలేకపోయింది.