గులాబీ అభ్యర్థుల గుండెల్లో గుబులు.. తగ్గేదేలే అంటున్న జగ్గా రెడ్డి..

దిశ ప్రతినిధి, మెదక్: హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకింది. అభ్యర్థులు భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ హీట్ తగ్గలేదు. ఏకగ్రీవం చేసుకుందామనుకున్న టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ బరిలో నిల్వడంతో ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. నామినేషన్ ముగిసిన వెంటనే అధికార టీఆర్ఎస్ తమ పార్టీ నాయకులను క్యాంపులకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తమ ఓట్లు చీలకుండా ఎప్పటికప్పుడు వారితో సమావేశం నిర్వహిస్తూ […]

Update: 2021-12-12 06:23 GMT

దిశ ప్రతినిధి, మెదక్: హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకింది. అభ్యర్థులు భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ హీట్ తగ్గలేదు. ఏకగ్రీవం చేసుకుందామనుకున్న టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ బరిలో నిల్వడంతో ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. నామినేషన్ ముగిసిన వెంటనే అధికార టీఆర్ఎస్ తమ పార్టీ నాయకులను క్యాంపులకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తమ ఓట్లు చీలకుండా ఎప్పటికప్పుడు వారితో సమావేశం నిర్వహిస్తూ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు ఈ నెల 10న ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 9 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

1026 మంది ఓటర్లకు 1018 మంది ( 99.22 శాతం ) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచారు. కానీ అభ్యర్థుల్లో మాత్రం గుబులు పోవడం లేదు. గెలుపుపై గులాబీ పార్టీ పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోన టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కుతుందా లేదా అన్న టెన్షన్‌లో ఉంది. ఇదిలా ఉండగా బెట్టింగ్ రాయుళ్లు ఎప్పటిలాగే రెండు పార్టీలపై పందేలు కాస్తున్నారు.

గులాబీలో గెలుపు గుబులు..

ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకే అత్యధిక ఓటర్లు ఉన్నారు. అయిన గులాబీ నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. జిల్లాలోని 1026 ఓటర్లలో 777 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవే. టీఆర్ఎస్ టెన్షన్‌కి కారణం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాస్త ఆగ్రహంగా ఉండటం. టీఆర్ఎస్ నుండి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు నిరక్షరాస్యులు ఉండటంతో కాస్త ఆందోళన చెందుతుంది. స్వంత పార్టీకి ఓటేసిన సరైన క్రమంలో ఓటేశారా లేదా అన్నది కూడా గులాబీ పార్టీని టెన్షన్ పెడుతుంది. పైకి భారీ బంఫర్ మెజార్టీతో గెలుస్తామని పార్టీ అభ్యర్థి, మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా కాంగ్రెస్ ఓట్లు సైతం తమకే పడుతాయంటూ చెబుతున్నారు. పోలింగ్ ముగియగానే పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల వివరాలను పోలింగ్ ఏజెంట్ల ద్వారా తెప్పించుకొని టీఆర్ఎస్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయనే లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కుతుందా..

అధికార టీఆర్ఎస్‌ పార్టీకి పోటిగా కాంగ్రెస్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్‌ పార్టీ నాయకులపై, జిల్లా మంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 230 ఓట్లు ఉన్నాయని, అంతకుమించి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిశాక కూడా అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా సమీక్షించుకున్న కాంగ్రెస్ తమకు 400 ఓట్లు వస్తాయంటూన్నారు. శనివారం రోజున కూడా 230 ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చిన తన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యలు చేయడంపై నిజంగానే కాంగ్రెస్కు అన్ని ఓట్లు వస్తాయా అంటూ జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయం

జోరుగా బెట్టింగ్స్..

ఏ ఎన్నికలు వచ్చిన గెలుపుపై మెదక్ జిల్లాలో బెట్టింగ్ జోరుగా జరుగుతుంది. బెట్టింగ్‌పై పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. ఇరు పార్టీల నాయకులతో పాటు జిల్లాలోని సాధారణ వ్యక్తులు లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ 800 కు పైగా ఓట్లు సాధిస్తుందని కొందరు బెట్టింగ్ కాస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి 400 ఓట్లు ఖచ్చితంగా వస్తాయి, డిపాజిట్ దక్కుతుందంటూ మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. ఏదేమైనా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుంది.. ఎవరికి నష్టాన్ని చేకూరుస్తుందనే ఉత్కంఠతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News