‘స్థానిక’ ఓటర్లను రోబోలుగా మార్చిన టీఆర్ఎస్ : జీవన్ రెడ్డి
దిశ, నారాయణఖేడ్ : స్థానిక సంస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డిలు అన్నారు. శుక్రవారం నారాయణ ఖేడ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జీవన్ రెడ్డి, నారాయణఖేడ్‌లో ఓటింగ్ తీరును పరిశీలించడానికి వచ్చిన మెదక్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అన్ని అభివృద్ధి పనులు 14వ ప్లానింగ్ కమిషన్ ద్వారా వచ్చే […]
దిశ, నారాయణఖేడ్ : స్థానిక సంస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డిలు అన్నారు. శుక్రవారం నారాయణ ఖేడ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జీవన్ రెడ్డి, నారాయణఖేడ్‌లో ఓటింగ్ తీరును పరిశీలించడానికి వచ్చిన మెదక్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అన్ని అభివృద్ధి పనులు 14వ ప్లానింగ్ కమిషన్ ద్వారా వచ్చే నిధులతోనే ప్రస్తుతం కొనసాగుతున్నాయన్నారు.
గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకుంటున్నదని, దీంతో చిన్న గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. వారికి వచ్చే నిధులు ట్రాక్టర్ వాయిదా చెల్లింపులకే సరిపోతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు సరైన క్వాలిటీతో లేవన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలను టీఆర్ఎస్ పార్టీ క్యాంపునకు తీసుకెళ్లి రోబోలా మార్చి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టి పోటీ వల్లనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు గుర్తింపు లభించిందని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సురేష్ షెట్కార్, టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.