వేదికపై టీఆర్ఎస్ నేతలను అలా చూసి షాక్ అవుతోన్న జనం

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా ఇంకా పోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్యశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. మరి కొన్ని రోజులు ప్రజలంతా మాస్కును మరవొద్దని డీహెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పండుగలు, ఉత్సవాలల్లో ప్రజలంతా మాస్కును ధరించారు. అయితే, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరుగుతొన్న టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకులు మాస్కులు ధరించడం మరిచారు. […]

Update: 2021-10-25 03:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా ఇంకా పోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్యశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. మరి కొన్ని రోజులు ప్రజలంతా మాస్కును మరవొద్దని డీహెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పండుగలు, ఉత్సవాలల్లో ప్రజలంతా మాస్కును ధరించారు.

అయితే, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరుగుతొన్న టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకులు మాస్కులు ధరించడం మరిచారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కూడా మాస్కు పెట్టుకోకపోవడం గమనార్హం. దీంతో వేదికపై టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాస్కులు లేకుండా చూసి జనం షాక్ అవుతున్నారు. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రజలకు దిశా నిర్ధేశం చేసే ప్రజా ప్రతినిధులే ఇలా చేసి ఏం చెప్పాలనుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి తప్పిదాల వల్లనే కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

Tags:    

Similar News