‘రామ‌ప్ప, వేయి స్తంభాల గుడిని పున‌రుద్ధరించాలి’

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్‌: అర్బన్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, ములుగు జిల్లాలోని రామ‌ప్ప దేవాల‌యాలను పున‌రుద్ధరించాల‌ని ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాశ్, మాలోత్ కవిత కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ ప‌టేల్‌ను బుధ‌వారం న్యూఢిల్లీలో క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. కాకతీయుల కళలకు కాణాచిగా ప్రసిద్ధి గాంచిన చారిత్రక ఆలయాలు వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల్లో చేప‌ట్టిన సమగ్ర అభివృద్ధి, పునరుద్ధరణ పనులను మొదట […]

Update: 2021-03-24 08:23 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్‌: అర్బన్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, ములుగు జిల్లాలోని రామ‌ప్ప దేవాల‌యాలను పున‌రుద్ధరించాల‌ని ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాశ్, మాలోత్ కవిత కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ ప‌టేల్‌ను బుధ‌వారం న్యూఢిల్లీలో క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. కాకతీయుల కళలకు కాణాచిగా ప్రసిద్ధి గాంచిన చారిత్రక ఆలయాలు వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల్లో చేప‌ట్టిన సమగ్ర అభివృద్ధి, పునరుద్ధరణ పనులను మొదట 18 నెలల్లో పూర్తి చేయాలని భావించారని, అయితే దబ్దాకాలం దాటినా ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. అందుకు సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తి చేసి ఆ ఆలయాల స‌మ‌గ్ర అభివృద్ధికి పాటు ప‌డాల‌ని కోరారు.

Tags:    

Similar News