బిగ్ బ్రేకింగ్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

దిశ, వెబ్ డెస్క్:  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ ఖరారు చేసింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మధుసూదనాచారి, కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలిత, వెంకట్రామిరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. చివరిలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అవకాశం చేజారింది. కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా పిలుపు వచ్చింది . దీంతో నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రగతి భవన్‌కు […]

Update: 2021-11-15 23:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ ఖరారు చేసింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మధుసూదనాచారి, కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలిత, వెంకట్రామిరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. చివరిలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అవకాశం చేజారింది. కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా పిలుపు వచ్చింది . దీంతో నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు. కాసేపట్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇవి టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం కానున్నాయి.

కాళ్లు మొక్కి… అభివృద్ధి పనులు చేపట్టి.. వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ దృష్టిలో ఇలా.

Tags:    

Similar News