రైస్ మిల్లర్లకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
దిశ, కామారెడ్డి: ధాన్యం తీసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన రైతులతో కలిసి ధాన్యం లోడు లారీతో కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. ధాన్యం త్వరగా లోడింగ్ అయ్యేలా చూడాలని కోరారు. అనంతరం గంప గోవర్దన్ మాట్లాడుతూ.. 3వ తేదీన రైతుల వద్ద తీసుకున్న ధాన్యం లోడు లారీని దేవునిపల్లి సాయి శ్రీనివాస రైస్ మిల్లుకు పంపిస్తే.. రైస్ మిల్లు […]
దిశ, కామారెడ్డి: ధాన్యం తీసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన రైతులతో కలిసి ధాన్యం లోడు లారీతో కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. ధాన్యం త్వరగా లోడింగ్ అయ్యేలా చూడాలని కోరారు.
అనంతరం గంప గోవర్దన్ మాట్లాడుతూ.. 3వ తేదీన రైతుల వద్ద తీసుకున్న ధాన్యం లోడు లారీని దేవునిపల్లి సాయి శ్రీనివాస రైస్ మిల్లుకు పంపిస్తే.. రైస్ మిల్లు యజమాని రైతులతో గొడవపడి లోడును తీసుకోము అని వెనక్కి పంపారన్నారు. వెంటనే నిజామాబాద్ డీసీఎస్ఓతో మాట్లాడి, ఉగ్రవాయి బ్రిడ్జి వద్ద గల వెంకటేశ్వర రైస్ మిల్లుకు తరలించడం జరిగిందన్నారు. అక్కడ కూడా మూడు రోజులు ధాన్యం నిల్వ ఉంచుకుని ఆ తర్వాత కొనుగోలు చేయమని చెప్పారన్నారు.
అందుకే ధాన్యంలోడును నేరుగా రైతులతో కలిసి కలెక్టరేట్‌కు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం డీఎస్ఓ, తహసీల్దార్లు ధాన్యం కొనుగోలు చేయని రైస్ మిల్లులకు వెళ్లి ఆరా తీస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయంపై కలెక్టర్ కూడా స్పందించి, ఇకపై స్వయంగా మానిటరింగ్ చేస్తానని హామీ ఇచ్చినట్టు గంప గోవర్దన్ చెప్పుకొచ్చారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని.. తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు వినతి పత్రం కూడా ఇచ్చినట్టు గంప గోవర్దన్ వెల్లడించారు.