బీజేపీ ఎంపీలు చవటలు, దద్దమ్మలు.. బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నేరస్థుల అడ్డ బీజేపీ గడ్డ’’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు మాటల మోడీకి చేతల కేసీఆర్‌కు మధ్య జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ బీజేపీకి మధ్య పోటీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఏం సాధించాలని యాత్ర చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్టు […]

Update: 2021-08-21 02:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నేరస్థుల అడ్డ బీజేపీ గడ్డ’’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు మాటల మోడీకి చేతల కేసీఆర్‌కు మధ్య జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ బీజేపీకి మధ్య పోటీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఏం సాధించాలని యాత్ర చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని, భాష మార్చు కోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేది పోయి అమ్మేస్తున్నారు అని మండిపడ్డారు. అదానీ, అంబానీలకు దేశాన్ని అమ్ముతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసీ లాంటి సంస్థలను కేంద్రం కాపాడేది పోయి అమ్మేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతున్న టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేయడం బీజేపీ నేతలకు తగదన్నారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. వారసత్వ రాజకీయాలు చేసేది బీజేపీ అని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఆత్మగౌరవాన్ని గుజరాత్‌కు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. నీతులు చెప్పడం మానుకొని వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు, లాక్ డౌన్, ఆక్సిజన్ కోసం ప్రజలను రోడ్లపై నిలబెట్టిన ఘనత కేంద్రానికే దక్కిందన్నారు. నిరుద్యోగ కార్మిక రైతు ఉద్యోగ వ్యతిరేకి కేంద్రం అన్నారు.

కృష్ణా జలాలపై రాత్రికిరాత్రే గెజిట్ విడుదల చేసిన ఘనత కూడా బీజేపీ దక్కిందన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం రద్దు చేసిన ఐటీఐఆర్‌ను పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు పోటీపడి మరీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోదాని బట్టి మాట్లాడాలని సూచించారు. తెలంగాణకు ఏం చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారి మాటల్లోనే తెలంగాణకు ఏం చేయలేదని స్పష్టం అవుతుందని పేర్కొన్నారు. ఎంపీలుగా మంత్రులుగా తెలంగాణకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుల నడ్డి విరుస్తుంది బీజేపీ అని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చవటలు, దద్దమ్మలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News