మహా ధర్నాకు టీఆర్ఎస్ రెడీ.. ఇందిరా పార్క్ వద్ద సందడి
దిశ, వెబ్‌డెస్క్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ గురువారం మహాధర్నాకు సిద్ధమైంది. ధర్న చౌక్ ఇందిరాపార్కు వద్దకు ఉదయం నుంచే టీఆర్ఎస్ నాయకులు, నేతలు వస్తున్నారు. అయితే ఈ ధర్నాలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం. ధర్నా కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్నది. ధర్నా అనంతరం టీఆర్‌ఎస్ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం […]
దిశ, వెబ్‌డెస్క్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ గురువారం మహాధర్నాకు సిద్ధమైంది. ధర్న చౌక్ ఇందిరాపార్కు వద్దకు ఉదయం నుంచే టీఆర్ఎస్ నాయకులు, నేతలు వస్తున్నారు.
అయితే ఈ ధర్నాలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం. ధర్నా కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్నది. ధర్నా అనంతరం టీఆర్‌ఎస్ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.