రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. త్వరగా కాంటా వేయండి..

దిశ పెన్ పహాడ్ : ధాన్యం కాంటాలు వెంటనే వెయ్యాలని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, పిఏసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుoట కండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు పెన్ పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో ఐకెపి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. త్వరితగతిన ధాన్యాన్ని కాంటాలు వెయ్యాలని అధికారులకు సూచించారు. రైతుల కు ఎలాంటి […]

Update: 2021-11-25 09:04 GMT

దిశ పెన్ పహాడ్ : ధాన్యం కాంటాలు వెంటనే వెయ్యాలని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, పిఏసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుoట కండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు పెన్ పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో ఐకెపి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. త్వరితగతిన ధాన్యాన్ని కాంటాలు వెయ్యాలని అధికారులకు సూచించారు.

రైతుల కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. తూకంలో హెచ్చుతగ్గులు ఉండకుండా చూడాలన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూస్తామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు తూముల ఇంద్రసేన రావు, సర్పంచ్ మామిడి వెంకన్న, కో ఆప్షన్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News