ప్రపంచంలోనే గొప్ప సాహితీవేత్త.. అన్నబాపు సాటే
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో సాహితి సామ్రాట్ అన్నబావు సాటే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు అన్నబావు సాటే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. స్థానిక నాయకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ… అన్నబావు ప్రపంచంలోనే గొప్ప సాహితీవేత్త అని ప్రశంసించాడు. ఆయన రచించిన రచనలు దేశ విదేశాల్లో మంచి ప్రజా ఆదరణ పొందాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతగానో కృషి […]
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో సాహితి సామ్రాట్ అన్నబావు సాటే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు అన్నబావు సాటే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. స్థానిక నాయకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ…
అన్నబావు ప్రపంచంలోనే గొప్ప సాహితీవేత్త అని ప్రశంసించాడు. ఆయన రచించిన రచనలు దేశ విదేశాల్లో మంచి ప్రజా ఆదరణ పొందాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతగానో కృషి చేశారని, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి శ్రమించాలని పిలుపునిచ్చారు.