రజకుల ఆశీర్వాద సభ సక్సెస్.. ఆనందంలో టీఆర్ఎస్ నేతలు
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన రజకుల ఆత్మీయ సమ్మేళనం, ఆశీర్వాద సభ పెద్ద ఎత్తున విజయవంతం అయింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రజకులు ఈ సభకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే హాస్పిటల్ కూడలి వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్‌లు ఆవిష్కరించారు. ఊహించిన దానికంటే ఎక్కువగా రజక సామాజిక వర్గానికి చెందిన వారు, ముఖ్యంగా మహిళలు ఈ […]
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన రజకుల ఆత్మీయ సమ్మేళనం, ఆశీర్వాద సభ పెద్ద ఎత్తున విజయవంతం అయింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రజకులు ఈ సభకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే హాస్పిటల్ కూడలి వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్‌లు ఆవిష్కరించారు.
ఊహించిన దానికంటే ఎక్కువగా రజక సామాజిక వర్గానికి చెందిన వారు, ముఖ్యంగా మహిళలు ఈ సభకు తరలివచ్చారు. రసమయి బాలకిషన్‌తో పాటు ప్రముఖ గాయకుడు సాయిచంద్ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు చేస్తున్న మేలుకు గుర్తుగా సభా వేదిక వద్ద.. ఏర్పాటు చేసిన ఇస్త్రీ పెట్టె.. టేబుల్ లాండ్రీ దుకాణం మోడల్ అందరినీ ఆకట్టుకుంది.
ఇంత పెద్ద ఎత్తున హుజురాబాద్ నియోజకవర్గంలో రజకుల సభ జరగడం ఇదే ప్రధానమని పలువురు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రజకుల సమీకరణకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో పాటు రజక సంఘం నాయకులను మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రత్యేకంగా అభినందించారు. తామంతా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు కృషి చేస్తామని రజక నాయకులు స్పష్టం చేయడం టీఆర్ఎస్ నేతలకు ఊరటనిచ్చింది.