మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా..? ‘గండ్ర’ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఫైర్
దిశ, టేకుమట్ల : భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మె్ల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై అసత్యమైన ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి హాజరై మాట్లాడుతూ.. భూపాలపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు టీఆర్ఎస్ పార్టీపై, […]
దిశ, టేకుమట్ల : భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మె్ల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై అసత్యమైన ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి హాజరై మాట్లాడుతూ.. భూపాలపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు టీఆర్ఎస్ పార్టీపై, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శించడాన్ని టీఆర్ఎస్ మండల పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. గండ్ర సత్యనారాయణ రావు పూటకో పార్టీ మారుస్తూ నీ వ్యక్తిగత స్వార్థం కోసం భూపాలపల్లి ప్రజలను మోసం చేస్తూ.. నువ్వు పేదవాడివి అని చెప్పుకుంటూ రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన గజదొంగ రేవంత్ రెడ్డి అని, ఇలాంటి దొంగకు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నువ్వు నిన్న బహిరంగ సభలో ఏఐఎఫ్‌బీ పార్టీ నుండి గెలుపొందిన కొంతమంది ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి మరణశాసనం రాస్తానంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు మరణ శాసనం ఎప్పుడో రాశారన్నారు. నువ్వు చేసే వ్యక్తిగత విమర్శలు చూస్తే తెలంగాణ ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. ఇక నుంచైనా ప్రజల గురించి ఆలోచించి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేకుంటే నువ్వు, నీ పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండా గల్లంతవుతారన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు కత్తి సంపత్, మండల నాయకులు ఆకునూరు తిరుపతి, సర్పంచ్ ఉద్దమారి మహేష్, ఉమెన్ దర్రావు, ఎంపీటీసీలు సంగి రవి, పింగిలి వెంకటేశ్వర్లు రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు దోడ్ల కోటి, టీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఆది రఘు, నల్లబెల్లి రవీందర్, మహిపాల్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.