ముదిరిన క్యాంప్ రాజకీయం.. ఫోన్లు లాక్కోవడంపై ఓటర్ల అసహనం..

దిశ, కొత్తగూడెం: గోవా క్యాంపునకు వెళ్ళి వచ్చిన ఓటర్లు కొత్తగూడెం చేరుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళక ముందు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా అందరి దగ్గర నుంచి టీఆర్‌ఎస్ నాయకులు ఫోన్లు తీసుకున్నారు. ఇలా చేయడం ఏంటని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమపై అంత నమ్మకం లేదా అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.‌ మీరు బయట మాత్రమే మమ్మల్ని కట్టడి చేయగలరు, లోపల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళాక మేము ఎవరికి ఓటు […]

Update: 2021-12-10 02:24 GMT

దిశ, కొత్తగూడెం: గోవా క్యాంపునకు వెళ్ళి వచ్చిన ఓటర్లు కొత్తగూడెం చేరుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళక ముందు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా అందరి దగ్గర నుంచి టీఆర్‌ఎస్ నాయకులు ఫోన్లు తీసుకున్నారు. ఇలా చేయడం ఏంటని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమపై అంత నమ్మకం లేదా అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.‌

మీరు బయట మాత్రమే మమ్మల్ని కట్టడి చేయగలరు, లోపల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళాక మేము ఎవరికి ఓటు వేస్తామో మీకు తెలుసా అని స్వరం పెంచారు. దీన్ని బట్టి చూస్తే, అధికార పార్టీ నాయకులు ఎంత భయపడుతున్నారో అర్థమౌతోందని జనం చర్చించుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం అవన్నీ అవాస్తవమని కొట్టి పారేశారు.

Tags:    

Similar News