టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యాయత్నం
దిశ, సిరిసిల్ల: పోడు భూమిలో సాగు చేసుకుంటుంటే.. గ్రామస్తులు, అటవీ అధికారులు అడ్డుపడ్డారని ఓ టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో చోటుచేసుకుంది. మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గోగుల రమేశ్ భూవివాదంలో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. దీంతో చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన భూమిని సాగు చేసుకుంటుంటే.. గ్రామస్తులు అడ్డుకోవడంతో పాటు అటవీ అధికారులు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వల్లే […]
దిశ, సిరిసిల్ల: పోడు భూమిలో సాగు చేసుకుంటుంటే.. గ్రామస్తులు, అటవీ అధికారులు అడ్డుపడ్డారని ఓ టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో చోటుచేసుకుంది. మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గోగుల రమేశ్ భూవివాదంలో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. దీంతో చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన భూమిని సాగు చేసుకుంటుంటే.. గ్రామస్తులు అడ్డుకోవడంతో పాటు అటవీ అధికారులు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు అతని బంధువులు చెప్పారు. అయితే, అటవీ శాఖకు చెందిన ఈ భూమిలో రమేష్ సాగు చేసుకుంటున్నాడని అధికారులు ఆరోపణ చేస్తుంటే.., గ్రామ అవసరాల కోసం ఆ భూమిని వినియోగించాలని స్థానికులు కోరడం గమనార్హం.