కవితపై కామెంట్లు.. ఈటల రాజేందర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు ఖండించారు. ఈటల.. మాటలను వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చిత్ర పటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రూప్ సింగ్ మాట్లాడుతూ.. […]

Update: 2021-06-07 07:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు ఖండించారు. ఈటల.. మాటలను వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చిత్ర పటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రూప్ సింగ్ మాట్లాడుతూ.. లక్షలాది మంది ఉద్యోగ, కార్మికులకు అండగా నిలుస్తున్న కవితపై ఈటల నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ కేవీకి అనుబంధంగానే ట్రేడ్ యూనియన్స్ విధానపరంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని, వాటి గురించి ఈటల మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత చొరవతోనే 4లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్ వస్తుందని, 28 వేల మంది ఆశ లకు రూ. 8వేల వేతనం, 18వేల మంది వీఓఏ లకు, 6వేల ఆర్పీలకు గౌరవేతనాలు అందుతున్నాయని, అంగన్వాడీలకు, వీఆర్ఏలకు వేతనాలు పెరిగాయని, సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ మొదలైన ఉద్యోగ, కార్మికులకు అనేక ప్రయోజనాలు కలిగాయని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు సంతోష్ రెడ్డి, మహేష్ పాటిల్, దాసు, రాజు, ఎన్.యాదలక్ష్మి, పి.సరిత తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News