కేశవరావు, సురేష్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం!
దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకుగాను మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్ వేర్వేరుగా నామినేషన్లను దాఖలు చేశారు. వీటి పరిశీలన సోమవారం జరగ్గా నిబంధనలకు అనుగుణంగా లేవన్న కారణంతో ఈ ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు […]
దిశ, న్యూస్‌బ్యూరో:
టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకుగాను మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్ వేర్వేరుగా నామినేషన్లను దాఖలు చేశారు. వీటి పరిశీలన సోమవారం జరగ్గా నిబంధనలకు అనుగుణంగా లేవన్న కారణంతో ఈ ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మాత్రమే బరిలో ఉన్నారు. వీరిద్దరి ఎన్నిక ఇక లాంఛనప్రాయమే.
రెండు సీట్లకుగాను ఇద్దరే బరిలో ఉండడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇంకా ముగియకపోవడంతో అప్పటిదాకా వేచి చూసిన తర్వాత వీరి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు రాష్ట్ర సీఈవో అధికారికంగా ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ వరకూ ఎన్నికల సంఘం వేచి చూడాల్సి ఉంటుంది. వీరిద్దరూ నామినేషన్లను ఉపసంహరించుకోలేని పక్షంలో అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్ల పరిశీలన అనంతరం వీరి నామినేషన్లు నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్నట్లే ఎన్నికల సంఘం ధృవీకరించింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కావడంతో ఆ రోజు సాయంత్రం ఎన్నికల సంఘం వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తుంది.
Tags : Telangana, TRS, Rajya Sabha, Keshavrao, Suresh Reddy, Unanimously elected, nominations