‘ఎన్నికల కోడ్ ను టీఆర్ఎస్ ఉల్లంఘిస్తోంది’

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్​ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం చీఫ్​ఎలక్ట్రోరల్​ఆఫీసర్​శశాంక్​గోయల్ కు వారు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్​పట్టణంలో నేటికీ కనీసం సైన్ బోర్డులు కూడా తొలగించలేదన్నారు. పలు స్కీమ్​లకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు కూడా అలాగే ఉన్నాయని వారు ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్​కనుసన్నల్లో పనిచేస్తున్నారని, టీఆర్ఎస్​నేతలు నిర్వహిస్తున్న కుల సంఘాలకు వీరు సహాయపడటం సరికాదన్నారు. గూగుల్ పే, ఫోన్​పే, పేటీఎం ద్వారా నగదు బదిలీలు చేపడుతూ […]

Update: 2021-09-29 11:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్​ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం చీఫ్​ఎలక్ట్రోరల్​ఆఫీసర్​శశాంక్​గోయల్ కు వారు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్​పట్టణంలో నేటికీ కనీసం సైన్ బోర్డులు కూడా తొలగించలేదన్నారు. పలు స్కీమ్​లకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు కూడా అలాగే ఉన్నాయని వారు ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్​కనుసన్నల్లో పనిచేస్తున్నారని, టీఆర్ఎస్​నేతలు నిర్వహిస్తున్న కుల సంఘాలకు వీరు సహాయపడటం సరికాదన్నారు. గూగుల్ పే, ఫోన్​పే, పేటీఎం ద్వారా నగదు బదిలీలు చేపడుతూ ఓటర్లను మభ్య పెడుతున్నారన్నారు.

కోడ్ ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు ఆరోపించారు. బీజేపీ నేషనల్​ఎగ్జిక్యూటివ్​మెంబర్​ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్​రెడ్డి చీఫ్​ఎలక్ట్రోరల్​ఆఫీసర్​కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్​కొనసాగుతున్న నేపథ్యంలో అక్టోబర్​2వ తేదీన హుజురాబాద్ లో పాదయాత్ర, పబ్లిక్​మీటింగ్​కు అనుమతించాలని వారు చీఫ్​ఎలక్ట్రోరల్ అధికారికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News