గులాబీ అభ్యర్థుల జాబితా రెడీ..!

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల సందడి షురూ కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా, రేపటి నుంచి (18వ తేదీ) నామినేషన్స్ స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార గులాబీ పార్టీ 150 డివిజన్లలో పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం అభ్యర్థుల లిస్టు విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే, గతేడాది పోటీచేసిన కార్పొరేటర్లలో కొందరికి అధిష్టానం మొండి […]

Update: 2020-11-17 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల సందడి షురూ కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా, రేపటి నుంచి (18వ తేదీ) నామినేషన్స్ స్వీకరించనున్నారు.

ఈ నేపథ్యంలోనే అధికార గులాబీ పార్టీ 150 డివిజన్లలో పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం అభ్యర్థుల లిస్టు విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే, గతేడాది పోటీచేసిన కార్పొరేటర్లలో కొందరికి అధిష్టానం మొండి చేయి అందించనుందని పలు కథనాలు వెలువడుతున్నాయి. అందుకు కారణం వారి పనితీరు బాగా లేకపోవడమే. కాగా, ఈనెల 20న నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ కాగా, 21న స్క్రూట్నీ ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ పోలింగ్ ఉండగా, 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News