ఈటలకు టీఆర్‌ఎస్ షాక్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
దిశ, కరీంనగర్/తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ పాత్ర కీలకంగా మారింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఒకే రోజున నాలుగు ఫిర్యాదులు చేసిన టీఆర్ఎస్. వైషమ్యాన్ని సృష్టించే విధంగా ఈటల రాజేందర్ బహిరంగభల్లో మాట్లాడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో, ర్యాలీలు నిర్వహిస్తున్నారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, పార్టీ ప్రతిష్టను డ్యామేజీ చేసే విధంగా కామెంట్లు ఛేస్తున్నారని.. ఇలా వేర్వేరు ఫిర్యాదుల్లో టీఆర్ఎస్ ప్రధాన […]
దిశ, కరీంనగర్/తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ పాత్ర కీలకంగా మారింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఒకే రోజున నాలుగు ఫిర్యాదులు చేసిన టీఆర్ఎస్. వైషమ్యాన్ని సృష్టించే విధంగా ఈటల రాజేందర్ బహిరంగభల్లో మాట్లాడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో, ర్యాలీలు నిర్వహిస్తున్నారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, పార్టీ ప్రతిష్టను డ్యామేజీ చేసే విధంగా కామెంట్లు ఛేస్తున్నారని.. ఇలా వేర్వేరు ఫిర్యాదుల్లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎన్నికల చట్టంలోని నిబంధనల మేరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఒక్కో ఒటరుకు నజరానాగా ఇవ్వబోతున్నదని, దసరా పండుగ సందర్భంగా ప్రతీ ఇంటికి రెండు కిలోల మాంసం, రెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నదని, వాటిని తీసుకున్నా కూడా ఓటు మాత్రం బీజేపీకే వేయాలంటూ ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానిస్తున్నారని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం, ఐపీసీలోని సెక్షన్ 171-బి, 171-హెచ్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఒక ఫిర్యాదులో కోరారు.
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయిన సంఘటనకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాల్క సుమన్ బాధ్యులంటూ మరో ఫిర్యాదులో సోమ భరత్ కుమార్ పేర్కొన్నారు. సాధారణ రోడ్డు ప్రమాదాన్ని బాల్క సుమన్ ఉద్దేశపూర్వకంగా చేయించి ఆటో డ్రైవర్ మృతికి కారణమయ్యారంటూ ఆపాదించడం పార్టీ ప్రతిష్టను, వ్యక్తిగత ప్రతిష్టను కాలరాయడమేనని, ఇది వైషమ్యాలను సృష్టించడానికి కారణమవుతున్నదని పేర్కొన్నారు. పైగా ఐదు గంటల పాటు వరంగల్-కరీంనగర్ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రోడ్ షో, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని, కానీ దీనికి విరుద్ధంగా హుజూరాబాద్ పట్టణంలో వరంగల్-కరీంనగర్ రహదారిపై రోడ్ షో నిర్వహించారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాంపల్లి జగన్ అనే వ్యక్తిపై బీజేపీకి చెందిన కార్యకర్తలు బోర్నపల్లి గ్రామం దగ్గర మాటుకాచి దాడికి పాల్పడ్డారని, ఇందుకు వాడిన వాహనం బీజేపీకి చెందిన గంగాడి కృష్ణారెడ్డికి చెందినదని పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు నాంపల్లి సుమన్, నిమ్మల సంజీవ్, అంగిరేకుల రాజు అని ఫిర్యాదు చేశారు. చేతులు కట్టేసి మరీ కత్తితో గాయాలు చేశారని, పరుష పదజాలంతో దూషించారని, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం హింసాత్మక చర్యలకు పాల్పడే కుట్రలకు తెరలేపుతుందని, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ కూడా ఉన్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.