వరంగల్ కార్పొరేషన్: ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులు
దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాంపూర్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కౌంటింగ్ చేపడుతున్నారు. కొన్ని డివిజన్లకు తొలిరౌండ్ ఫలితాలు వెలువడగా అత్యధిక స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 1,3, 12, 13, 20, 21, 23, 24, 25, 26, 27, 28, 29, 39, 53 డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. 2, 30, 34 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. 5వ […]
దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాంపూర్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కౌంటింగ్ చేపడుతున్నారు. కొన్ని డివిజన్లకు తొలిరౌండ్ ఫలితాలు వెలువడగా అత్యధిక స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 1,3, 12, 13, 20, 21, 23, 24, 25, 26, 27, 28, 29, 39, 53 డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. 2, 30, 34 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. 5వ డివిజన్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. ఇదిలా ఉండగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ 9 వార్డు 217 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి పూర్ణచారి విజయం సాధించారు. 261తో రెండో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి చిదురాల దేవేందర్, 131 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దార్నా వేణుగోపాల్ మూడో స్థానంలో నిలిచారు.