కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ ఫ్యామిలీ ఆదుకోవాలి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా బారిన పడి మృతిచెందిన విలేకరి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు నాయకులు, జర్నలిస్టులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో “వార్త తరంగాలు” రిపోర్టర్ గా పనిచేస్తున్న శశిధర్ కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. జర్నలిస్ట్ మృతి పట్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బండి వేణుగోపాల్, జి. సుధాకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శశికాంత్ చామకూర, మున్సిపల్ కౌన్సిలర్ ఎండీ సలీంలు సంతాపం వ్యక్తం […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా బారిన పడి మృతిచెందిన విలేకరి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు నాయకులు, జర్నలిస్టులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో “వార్త తరంగాలు” రిపోర్టర్ గా పనిచేస్తున్న శశిధర్ కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. జర్నలిస్ట్ మృతి పట్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బండి వేణుగోపాల్, జి. సుధాకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శశికాంత్ చామకూర, మున్సిపల్ కౌన్సిలర్ ఎండీ సలీంలు సంతాపం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయంలో శశిధర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. వెంటనే రూ.50 లక్షల పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.