పంచాయితీ పెద్దల అసభ్య ప్రవర్తన.. మహిళను వివస్త్రను చేసి..

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం కొత్తకొత్త టెక్నాలజీలతో ముందుకు దూసుకెళ్తోంది. కానీ కొంతమంది మాత్రం ఇంకా అనాగరికత లోనే జీవిస్తున్నారు. ప్రజలను రక్షించడానికి పోలీసులు, ప్రభుత్వాలు ఉన్నాయన్న విషయాన్ని మరిచి ఇంకా కొన్ని గ్రామాల్లో పంచాయితీలు నడుస్తున్నాయి. పంచాయతీల పేరుతో దోషులను నిర్ధారించి అమానవీయ శిక్షలు విధిస్తున్నారు. పంచాయితీ పెద్దలు అంటూ వారు తీసుకొనే నిర్ణయాలు కొన్ని సమాజానికి సిగ్గుచేటుగా మారుతున్నాయి. తాజాగా కొంతమంది పంచాయితీ పెద్దలు ఓ మహిళ తప్పు చేసిందని, ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో […]

Update: 2021-06-15 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం కొత్తకొత్త టెక్నాలజీలతో ముందుకు దూసుకెళ్తోంది. కానీ కొంతమంది మాత్రం ఇంకా అనాగరికత లోనే జీవిస్తున్నారు. ప్రజలను రక్షించడానికి పోలీసులు, ప్రభుత్వాలు ఉన్నాయన్న విషయాన్ని మరిచి ఇంకా కొన్ని గ్రామాల్లో పంచాయితీలు నడుస్తున్నాయి. పంచాయతీల పేరుతో దోషులను నిర్ధారించి అమానవీయ శిక్షలు విధిస్తున్నారు. పంచాయితీ పెద్దలు అంటూ వారు తీసుకొనే నిర్ణయాలు కొన్ని సమాజానికి సిగ్గుచేటుగా మారుతున్నాయి. తాజాగా కొంతమంది పంచాయితీ పెద్దలు ఓ మహిళ తప్పు చేసిందని, ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించిన అమానుష ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

పశ్చిమబెంగాల్ రాష్ట్రం అలీపూర్‌ద్వార్ జిల్లాలోని పశ్చిమ చెంగ్మార్ గ్రామానికి చెందిన ఓ వివాహిత గత కొన్నేళ్ల క్రితం భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది. అయితే వివాహితకు, ప్రియుడికి మధ్య గొడవలు మొదలుకావడంతో ఆమె ఇటీవలే ప్రియుడి దగ్గరనుండి వచ్చి భర్తతో కలిసి కాపురముంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రియుడు ఆమెపై పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీంతో పంచాయితీ పెద్దలు సోమవారం రాత్రి వివాహితను అందరిముందు నిలబెట్టి అసభ్యపదజాలంతో దూషించారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి ఊరేగించాలని తీర్పు ఇచ్చారు. పంచాయితీ పెద్దల మాటను జవదాటని గ్రామస్థులు వివాహితను వివస్త్రను చేసి గ్రామమంతా ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News