వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు కల్పించండి..
దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ ఇన్చార్జి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీచేసిన గుగులోతు రాజు నాయక్ ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి 200 నోట్ బుక్స్, పెన్నులను అందజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన బాలుర వసతి గృహాలు, జూలై వాడలో గల బాలికల వసతి గృహం నందు మౌలిక సదుపాయాలను కల్పించి, లైబ్రరీని కూడా ఏర్పాటు […]
దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ ఇన్చార్జి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీచేసిన గుగులోతు రాజు నాయక్ ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి 200 నోట్ బుక్స్, పెన్నులను అందజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన బాలుర వసతి గృహాలు, జూలై వాడలో గల బాలికల వసతి గృహం నందు మౌలిక సదుపాయాలను కల్పించి, లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
వడ్డేపల్లి మహిళా పింగళి కళాశాలలోని బాలికల వసతి గృహంలో సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో చదువుకునేందుకు వీలుగా సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని వసతి గృహాలకు ప్రత్యేక మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ నాయకులు డా. కొర్ర రాజేందర్, అధ్యక్షులు హుస్సేన్ నాయక్, డా.సోములు, డా.వెంకన్న భాస్కర్, దేవేందర్, వీరన్న ప్రశాంత్, సుమన్, సురేష్, రాకేష్ కృష్ణ నరేష్, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.