కరెంట్ షాక్‌తో గిరిజన రైతు మృతి
దిశ, ఆందోల్: కరెంటు తీగలకు తగిలి, షాక్‌కు గురై ఓ గిరిజన రైతు మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని గొంగ్లూర్‌తండాలో గురువారం చోటుచేసుకుంది. జోగిపేట సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం… మండల పరిధిలోని గోంగ్లూర్‌తండాకు చెందిన రమావత్ వాల్య(45) అనే రైతు గ్రామంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇవాళ ఉదయం చేపల కోసం ఇసోజీపేట చెరుకు వెళ్లి, అదే తాండాకు చెందిన భీంలా అనే రైతు తన పొలం మీదుగా […]
దిశ, ఆందోల్: కరెంటు తీగలకు తగిలి, షాక్‌కు గురై ఓ గిరిజన రైతు మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని గొంగ్లూర్‌తండాలో గురువారం చోటుచేసుకుంది. జోగిపేట సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం… మండల పరిధిలోని గోంగ్లూర్‌తండాకు చెందిన రమావత్ వాల్య(45) అనే రైతు గ్రామంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఇవాళ ఉదయం చేపల కోసం ఇసోజీపేట చెరుకు వెళ్లి, అదే తాండాకు చెందిన భీంలా అనే రైతు తన పొలం మీదుగా వస్తున్నారు. పొలంలో అటవీ పందులు రాకుండా ఏర్పాటు చేసుకున్న కరెంట్ వైరు తగిలి ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎవరి అనుమతి లేకుండా పొలం చుట్టూ అజాగ్రత్తగా కరెంట్ వైరు పెట్టడం మూలంగానే రైతు మృతిచెందినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.