సీఎం జగన్ కేసుల విచారణ వాయిదా

దిశ, ఏపీ బ్యూరో: సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి మంగళవారం సెలవులో ఉన్నందున ఇన్చార్జి న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసు నవంబరు 9కి వాయిదా పడింది. అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించిన ఈ కేసును కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ […]

Update: 2020-10-20 10:45 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి మంగళవారం సెలవులో ఉన్నందున ఇన్చార్జి న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసు నవంబరు 9కి వాయిదా పడింది.

అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించిన ఈ కేసును కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. నవంబరు 5న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపిన మేరకు తదుపరి విచారణను నాంపల్లి కోర్టు నవంబరు 9కి వాయిదా వేసింది.

Tags:    

Similar News