రీల్స్ కోసం యువతి పిచ్చిచేష్టలు .. చూసి చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఇదిగో వీడియో

ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదొక రకంగా ఫేమస్ అవ్వాలని యువతీ యువకులు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేసి పెడుతున్నారు.

Update: 2024-07-11 07:19 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదొక రకంగా ఫేమస్ అవ్వాలని యువతీ యువకులు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేసి పెడుతున్నారు. అయితే, కొన్ని సందర్భాలలో ఓకే కానీ, కొన్ని సార్లు చుట్టూ పక్కల వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొందరైతే హద్దు మీరి కూడా ప్రవర్తిస్తున్నారు. అందరినీ నవ్వించే వీడియోలైతే పర్వాలేదు.. కానీ, ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ వివాదాల్లో ఇరుక్కొని మరి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే ఘటన కూడా అలాంటిదే..

ఓ యువతి డ్యాన్స్ చేయడానికి మంచి ప్లేస్ లే లేనట్టు ఓ రైల్వే ప్లాట్‌ఫాం మధ్యలో పిచ్చిపట్టినట్టు డ్యాన్స్ చేస్తూ ఓ మహిళా ప్రయాణికురాలికి తగిలింది. తగిలిన తర్వాత.. ఆ మహిళకు సారీ కూడా చెప్పకుండా మళ్లీ నేలపై పడుకుని డ్యాన్స్‌ మూమెంట్లు మొదలు పెట్టింది. ఈ సారి మళ్లీ అదే మహిళపై పడింది..ఇక ఆమె కోపాన్ని ఆపుకోలేక చెంప మీద గట్టిగా కొడుతున్నా కూడా ఆ యువతికి చలనం కూడా లేదు నువ్వు నన్ను ఏమైనా చేసుకో డ్యాన్స్‌ మాత్రం ఆపనంటూ చేస్తూనే ఉంది. ఇదంతా చూస్తున్న.. అక్కడ జనాలు ఈమె మద్యం తీసుకుని ఇలా కుప్పిగంతులు చేస్తుందా ? అనే సందేహంతో దూరంగా వెళ్లిపోసాగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.


Similar News