Wayanad Landslides : ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌లో మిరాకిల్.. ప్రాణాలతో బయటపడిన ఆ నలుగురు

వయనాడ్‌‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

Update: 2024-08-02 06:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: వయనాడ్‌‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. భారీ భవనాలు, శిథిలాల కిందపడి ఇప్పటికి 308 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయాలయ్యాయి. అదేవిధంగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు ఇండియన్ ఆర్మీ డ్రోన్ ఆధారిత రాడార్ టెక్నాలజీతో గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలో వయనాడ్‌లోని పడవెట్టి కున్ను ప్రాంతంలో చేపట్టిన ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత శిథిలాల కింద ఉన్న నలుగురిని ఆర్మీ గుర్తించింది. దీంతో వారు హుటాహుటిన స్పాట్‌లోకి వెళ్లి శిథిలాల కింది నుంచి బయటకు తీయడంతో వారు మృత్యుంజయులుగా ప్రాణాలతో బయటపడ్డారు. అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.  

Tags:    

Similar News