Viral Video: "రోజూ నాకు ఇదే పని".. బైకర్‌ను ఢీ కొట్టిన ఇన్‌స్టాగ్రామర్ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు
రాష్ డ్రైవింగ్ చేస్తున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ బైక్‌ను ఢీకొట్టి, ఏం పర్లేదు.. నాకు రోజూ ఇదే పని అని నిర్లక్ష్యంగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ డ్రైవింగ్ చేస్తున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ బైక్‌ను ఢీకొట్టి, ఏం పర్లేదు.. నాకు రోజూ ఇదే పని అని నిర్లక్ష్యంగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ ఘటన ఢిల్లీలోని ఫరీదాబాద్ లో జరిగింది. రజత్ దలాల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో ఫిట్‌నెస్ కు సంబంధించిన వీడియోలు పెడుతుంటాడు. అయితే అతడు కారులో ఓ యువతితో పాటు ఫరీదాబాద్- బదర్ పూర్ రహదారిపై 143 కిలో మీటర్ల వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు. మధ్యలో ఓ బైకర్ ను ఢీకొట్టడంతో అతడు కిందపడిపోయారు. బైకర్ ను ఢీ కొట్టడమే కాక "ఏం పర్లేదు... నాకు రోజూ ఇదే పని" అంటూ నిర్లక్ష్యంగా సమధానం చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామర్ రజత్ దలాల్ పై మండిపడుతూ.. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరుతున్నారు. అంతేగాక ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు చట్టం అంటే భయం లేకుండా పోయిందని, ఫేమస్ అవ్వడం కోసం ఏదైనా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.