Viral Video: గ్రేట్ పర్సన్.. డేంజర్ జోన్‌లో దర్జాగా నిద్రపోయాడు

గొడుగు వేసుకొని ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ పై నిద్రపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

Update: 2024-08-25 09:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గొడుగు వేసుకొని ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ పై నిద్రపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇది గమణించిన లోకోపైలట్ రైలును ఆపివేశాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో నిత్యం రైళ్లు నడిచే మార్గంలో రైల్వే ట్రాక్ పై మధ్యవయస్సు ఉన్న ఒక వ్యక్తి ఎండ తగలకుండా గొడుగు అడ్డం పెట్టుకొని మరీ సేద తీరుతున్నాడు. అదే సమయంలో ట్రాక్ పై రైలు వేగంగా దూసుకొస్తుంది. దూరంగా చూసి రైల్వే ట్రాక్ పై ఏదో ఉందని గమణించిన లోకోపైలట్ రెండు మూడు సార్లు హారన్ మోగించాడు.

అయినా సరే కదలకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి రైలు ఆపేశాడు. దగ్గరకి వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి ఆదమరిచి నిద్రపోతున్నాడు. వెంటనే అతన్ని నిద్రలోనుంచి లేపి పంపించి, తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు లోకో పైలట్ సమయస్పూర్తిని మెచ్చుకుంటుండగా.. మరికొందరు డేంజర్ జోన్‌లో కూడా దర్జాగా నిద్రపోతున్నాడు, గ్రేట్ పర్సన్ అని, ట్రాక్ పై పడుకొని గొడుగుతో ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నాడు అని, ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Similar News