‘క్లిక్ హియర్’ (ట్విట్టర్) ఎక్స్‌లో ట్రెండ్.. అసలు ఈ ట్రెండ్ ఏమిటి?

సోషల్ మీడియా దిగ్గజ నెట్‌వర్క్ అయిన ట్విట్టర్ (ఎక్స్)లో ప్రతి రోజు ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్‌లోకి వస్తదనే విషయం తెలిసిందే. తాజాగా ‘క్లిక్ హియర్’ అని ఓ పోస్ట్ చేస్తున్నారు.

Update: 2024-03-31 07:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా దిగ్గజ నెట్‌వర్క్ అయిన ట్విట్టర్ (ఎక్స్)లో ప్రతి రోజు ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్‌లోకి వస్తదనే విషయం తెలిసిందే. తాజాగా ‘క్లిక్ హియర్’ అని ఓ పోస్ట్ చేస్తున్నారు. దాదాపు వేల మంది యూజర్లు ఈ క్లిక్ హియర్ అనే ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. క్లిక్ హియర్ అని ఓ ఫోటో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఒక బాణం గుర్తు కామెంట్స్‌వైపు సూచిస్తుంటుంది. అక్కడే ‘ఆల్ట్’ అనే పదం ఉంటుంది. ఆ ‘ఆల్ట్’‌ను క్లిక్ చేయగానే ఒక సందేశం మనకు కనిపిస్తుంది. ఆల్ట్‌ అనేది క్లిక్ చేయకపోతే కేవలం క్లిక్ హియర్ అనే ఫోటోను మాత్రమే చూడగలము. అందులో దాగి ఉన్న సందేశాన్ని మాత్రం చూడలేము. అయితే ‘సందేశం’ చూసిన నెటిజన్లు అనుకూలంగా లేదా విమర్శిస్తూ కామెంట్స్ రూపంలో చెలరేగిపోతుంటారు.

క్లిక్ హియర్ అనే ట్రెండ్ సాధరణ నెటిజన్లు మాత్రమే కాకుండ పొలిటికల్ పార్టీలు, నేతలు, సెలబ్రెటీలు తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్లిక్ హియర్ అనే ట్రెండ్ ఫాలో అవుతుంది. అందులో ‘భారత్ ఏకమవుతుంది. ఇండియా గెలుస్తుంది’ అని సందేశం ఉంది. బీజేపీ పార్టీ ‘మళ్లీ మోడీ సర్కార్ రాబోతుంది’ అని సందేశం ఉంది. కాగా, ట్విట్టర్‌లో గతంలో నుంచే ఈ ట్రెండ్ నడుస్తోంది.

Tags:    

Similar News