వైద్య చరిత్రలోనే ఇది మొదటి సారి..అది ఏంటంటే ?

పసిబిడ్డలు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు నిండకుండానే జన్మిస్తుంటారు

Update: 2023-01-07 03:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : పసిబిడ్డలు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు నిండకుండానే జన్మిస్తుంటారు. 8 నెల లేక 9 నెలలో పసి బిడ్డలు జన్మిస్తుంటారు. అయితే ఆరు నెలలకే శిశువు జన్మించింది. ఇది మాత్రమే కాకుండా ఇంకో విషయం కూడా ఆశ్చర్య పరిచింది..అది ఏంటంటే ఆ బిడ్డ బరువు. ఆ పసి బిడ్డ బరువు 400 గ్రాములు ఉంది.ఇలాంటి శిశువులు బ్రతకడం కూడా చాలా కష్టమట. బ్రతికే అవకాశం 0.5% మాత్రమే ఉంటుందట. ఈ శిశువు పేరు శివన్య. ఈ విషయాన్ని సూర్య మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సచిన్ షా వెల్లడించారు.ఆయన మీడియా ముందు మాట్లాడుతూ 'నెలలు నిండకుండానే కొంతమంది పుడుతుంటారు . ఇలాంటివి ఎక్కడో చాలా అరుదుగా జరుగుతుంటాయి. దీనిని బైకార్న్యుయేట్ అని పిలుస్తారు. ఒక స్త్రీ గర్భం దాల్చేటప్పుడు రెండు వేర్వేరు సంచులు ఏర్పడితే రెండు సంచుల్లో ఒకటి చిన్నదిగా ఉంటె.. ఇలాంటివి జరుగుతుంటాయని తెలిపారు.

Tags:    

Similar News