చుక్కేసిన చిరుత..! తాను చిరుతననే విషయమే మర్చిపోయింది..
మనుషులను చూడగానే చిరుత పులులు వారిపై దాడి చేయడం లేదా అక్కడి నుంచి పారి పోవడం వంటివి చేస్తాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: మనుషులను చూడగానే చిరుత పులులు వారిపై దాడి చేయడం లేదా అక్కడి నుంచి పారి పోవడం వంటివి చేస్తాయి. కానీ ఓ చిరుత పులి అందుకు భిన్నంగా మనుషులకు ఎలాంటి హాని చేయకుండా పెంచుకున్న కుక్కల ప్రవర్తించింది. గ్రామస్తులను ఏమీ చేయకుండా వారి వెంట నడుస్తోంది. గ్రామస్తులు సైతం చిరుతను చూసి భయపడకుండా దానిపై చేయి వేస్తూ.. పెంపుడు జంతువుతో ఉన్నట్లు చనువుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే చిరుత పులి అలా ప్రవర్తించడానికి కారణం.. ఆ చిరుత మద్యం తాగిందని అందుకే ఊగుతూ వారిని ఏమీ అనకుండా వారి వెంట నడుస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైకం ఎంతటి వాడి నైన మార్చగలదు అనడానికి ఉదాహరణ ఈ చిరుత రుజువు చేసినట్లయింది. అయితే మహారాష్ట్రలో ఒక మందు ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన చిరుత మద్యం తాగేసి తాను చిరుతననే విషయమే మర్చిపోయిందని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ లో మద్యం తాగిన చిరుత అని, పంజాబ్లో మద్యం తాగిన చిరుత అని నెట్టింట్లో ఈ చిరుత వీడియో వైరల్ అవుతుంది. ప్లేస్లు వేరైనా చిరుత మాత్రం మద్యం తాగిందనే నెట్టింట్లో వీడియో చక్కర్లు కొడుతోంది.