డెలివరీకెళ్లే ముందు మాస్ స్టెప్పులేసిన స్టార్ నటి.. భయాందోళనకు గురవుతోన్న జనాలు! (వీడియో)
ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ కాగానే మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు.
దిశ, ఫీచర్స్: ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ కాగానే మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. నాణ్యమైన ఫుడ్ సమయానికి తీసుకుంటూ ఎన్నో జాగ్రత్తలు వహిస్తారు. అంతేకాకుండా నడవడం, పరిగెత్తడం వంటివి అస్సలు చేయరు. ఇంకా డెలివరీ సమయంలో అయితే మరింత జాగ్రత్త పడతారు. కానీ ఓ నటి మాత్రం డెలివరీకి వెళ్తూ డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలోని జనాలందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కొంతమంది టెన్షన్ పడుతారు. మరికొంతమంది నెలలు నిండటంతో నొప్పులు వస్తాయి. ఆ నొప్పిని భరించలేక విపరీతంగా ఏడుస్తారు.
కానీ మలయాళ టీవీ ఇండస్ట్రీకి చెందిన లక్ష్మి అనే నటి డెలివరీకి వెళ్లే ముందు డాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డెలివరీ కోసం లేజర్ రూంలోకి వెళ్తోన్న టైంలో తన హస్బెండ్‌ను ఓ రీల్ చేద్దామా అని లక్షి అడిగిందట. దీంతో తన భర్త అజర్ మహ్మద్ ఇకే అంటూ తను డాన్స్ చేస్తుంటూ వీడియో తీశాడు.
ప్రస్తుతం ఈ వీడియో లక్ష్మి వేసే స్టెప్పులు నెట్టింట వైరల్ కావడంతో జనాలందరూ షాక్ అవుతున్నారు. కొంతమంది ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొంతమంది 9 నెలలు బిడ్డను మోసి ఇలాంటి చిలిపి చేష్టలు వల్ల ఏమైనా అయితే ఎలా అంటూ భయపడుతూ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇకపోతే లక్ష్మి కూడా మంచి డాన్సర్. ఈ నటి చేసే రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాయి.