టికెట్ తీయలేక సంవత్సరం బిడ్డను ఎయిర్ పోర్టులో వదిలి తల్లిదండ్రులు పరార్..?
సాధారణంగా చిన్న పిల్లల ప్రయాణాలకు టికెట్స్ ఉండవు అని అందరికీ తెలిసిన విషయమే.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చిన్న పిల్లల ప్రయాణాలకు టికెట్స్ ఉండవు అని అందరికీ తెలిసిన విషయమే. ఓ ఏజ్ పరిమితి వరకు ఇది వర్తిస్తుంది. బస్సులో, రైల్లో, విమానాల్లో ఎక్కడైనా ఈ పద్ధతి ఉంటుంది. అయితే.. ఒక సంవత్సరం చిన్నారులకు కూడా టికెట్స్ ఉంటుందని ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అదే విధంగా ఓ తల్లిదండ్రులు తన సంవత్సరం బిడ్డకు విమాన టికెట్ తీయలేదు. దీనిని గమనించిన సిబ్బంది వాళ్లను ఆపే ప్రయత్నం చేయడంతో.. తల్లిదండ్రులు తన బిడ్డనే వదిలి వెళ్లేందుకు సిద్దపడ్డారు. ఈ షాకింగ్ సంఘటన ఇజ్రాయెల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బెల్జియం పాస్పోర్ట్ ఉన్న తల్లిదండ్రులు తన సంవత్సరం బిడ్డతో ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారు రావాల్సిన సమయం కంటే గంట లేటుగా విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ సిబ్బంది వారిని ఆపి టికెట్లు అడిగారు. అయితే తల్లిదండ్రులు టికెట్లును మాత్రమే సిబ్బందికి చూపించారు. సంవత్సరం చిన్నారికి టికెట్ తీయలేదని సిబ్బంది వారిని ప్రశ్నించారు. అయితే తల్లిదండ్రులు వారితో వాదనకు దిగారు. అంతే కాకుండా ఫ్ట్రోలర్‌లో ఉన్న చిన్నారిని అక్కడే వదిలి హడావిడిగా విమానం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అది గమనించిన భద్రతా సిబ్బంది అలర్ట్ చేయడంతో.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అంతా అక్కన ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.