Tigers : పులులను చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్
జనారణ్యానికి దూరంగా అభయారణ్యం(Reserve Forest)లో స్వేచ్చగా సంచరించే పులుల(Tigers)ను సైతం మనుషులు ఇబ్బంది పెడుతున్న ఘటనలు తరుచు చూస్తున్నాం.
దిశ, వెబ్ డెస్క్ : జనారణ్యానికి దూరంగా అభయారణ్యం(Reserve Forest)లో స్వేచ్చగా సంచరించే పులుల(Tigers)ను సైతం మనుషులు ఇబ్బంది పెడుతున్న ఘటనలు తరుచు చూస్తున్నాం. మహారాష్ట్రలోని ఉమ్రేడ్ పౌని కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో పిల్లలతో వెలుతున్న పెద్దపులిని సఫారీ వాహనాలు..పర్యాటకులు చేసిన హంగామాతో కలవరపడింది.
అభయారణ్యంలో సఫారీ వాహనాలు వెళ్లే మార్గంలో పోదల మాటు నుంచి ఓ పెద్దపులి తన ఐదు పిల్లల(Big Tigress With Five Cubs)తో కలిసి రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో అటుగా వచ్చిన నాలుగైదు సఫారీ వాహనాలు పెద్ద పులి, దాని పిల్లలకు రెండు వైపుల ఒకేసారి చుట్టుముట్టినట్లుగా దగ్గరగా వచ్చాయి. పులులను దగ్గరగా చూసేందుకు, ఫోటోలు తీసుకునే ప్రయత్నంలో పర్యాటకుల సఫారీ వాహనాలను వాటికి దగ్గరగా తీసుకెళ్లగా వారి హడావుడితో పులి, వాటి పిల్లలు ఆందోళనకు గురయ్యాయి.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్(Video Viral)కావడంతో అటవీ అధికారులపై సస్పెన్షన్(Suspension of officials) వేటు పడింది. తాజాగా ఈ ఘటనపై ముంబె(Bombay High Court)కోర్టు విచారణ(Inquiry)కు ఆదేశించింది.