పెళ్లి వేదిక పై గిఫ్ట్ ఓపెన్ చేసిన వరుడు.. అది చూసి జంప్ .. దానిలో ఏముందంటే?

ఎంత ఆపాలని ప్రయత్నించినా వినకుండా పెళ్లికొడుకు వెళ్లిపోయాడు.

Update: 2024-04-12 08:48 GMT

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతాయి. వధూవరుల మధ్య జరిగే ప్రతి చిన్న వింత సంఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.. వీటిలో కొన్ని ప్రజలను నవ్విస్తాయి. తాజాగా , అలాంటి ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. పెళ్లిలో వరుడు తన కొత్త ఫోన్‌ ను అన్‌బాక్స్ చేశాడు. చివరికి ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

వధువు కుటుంబ సభ్యులు కొత్త ఐఫోన్ బాక్స్‌ను ఇచ్చి దానిని ఓపెన్ చేయమని చెప్పారు. పెళ్లికొడుకు ఐఫోన్ బాక్సును చూడగానే ఎంతో సంతోషంతో దాన్ని కూడా ఓపెన్ చేసి చూసాడు. లోపల ఐఫోన్ 14 ఉంటుంది .. నేను ఐఫోన్ 15 అడిగితే.. మీరు ఐఫోన్ 14 ఎలా తెస్తారంటూ గొడవ పెట్టుకుంటాడు. అమ్మాయి తరపున వాళ్లు ఎంత చెప్పినా కూడా వినడు. చివరికి కొత్త ఫోన్‌ని కుర్చీలో పడేసి కోపంగా వెళ్ళిపోయాడు. దీంతో అక్కడున్న వారందరు షాక్ అవుతారు. ఎంత ఆపాలని ప్రయత్నించినా వినకుండా పెళ్లికొడుకు వెళ్లిపోయాడు.

అయితే, అదంతా వినోదం కోసం చేసినా నెటిజన్లు మాత్రం ఆయన నటనను మెచ్చుకుంటున్నారు. దీనిపై స్పందించిన నెటిజెన్స్ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇది నిజం కాదు కాబట్టి సరిపోయింది.. ఒక వేళ నిజంగా ఇలా జరిగి ఉంటే ఆ పెళ్లి ఆగిపోయేది.. కామెడీ చేయండి.. కానీ లిమిట్స్ క్రాస్ చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News